వింబుల్డన్ సింగిల్స్ విజేతగా జకోవిచ్ - కెరీర్‌లో నాలుగో టైటిల్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ దుమ్మురేపాడు. తన మునుపటి ఫామ్, ఆటతీరును ప్రదర్శించిన జకోవిచ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించి అభిమానుల కల నెరవేర్చాడు.
ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ దుమ్మురేపాడు. తన మునుపటి ఫామ్, ఆటతీరును ప్రదర్శించిన జకోవిచ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించి అభిమానుల కల నెరవేర్చాడు. అలాగే, తన కెరీర్‌లో నాలుగో వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. మొత్తంగా అతనికి 13వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.
ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీలో జకోవిచ్ 6-2, 6-2, 7-6(3) తేడాతో సౌతాఫ్రికా స్టార్, ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్‌పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను జకోవిచ్ అలవోకగా గెలుచుకున్నప్పటికీ మూడో సెట్‌లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.
మూడో సెట్‌లో జకోవిచ్ - ఆండర్సన్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. టైబ్రేక్‌కు దారి తీయడంతో ఆ సెట్‌లో నూ జకోవిచ్ 6-3తేడాతో గెలిచి టైటిల్‌ను ముద్దాడాడు. ఈ టోర్నీలో అండర్సన్‌కు ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం. కాగా, జకోవిచ్ గతంలో 2011, 2014, 2015 సంవత్సరాల్లో వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెల్సిందే.