ఆర్చరీ నాలుగో వరల్డ్ కప్- రజతం సాధించిన భారత మహిళల జట్టు
ఆర్చర్ జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన జ్యోతి సురేఖ రెండు పతకాలను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నీలో సురేఖ, త్ర
ఆర్చర్ జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన జ్యోతి సురేఖ రెండు పతకాలను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నీలో సురేఖ, త్రిషా దేబ్, ముస్కాన్‌లతో కూడిన భారత మహిళల జట్టు పాయింట్ తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది.
ఫైనల్లో భారత్ 228-229తో సోఫీ డోడ్‌మోంట్, అమెలీ సాన్ సెనోట్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో పరాజయం పాలై రజత పతకాన్ని దక్కించుకుంది.
నాలుగు రౌండ్‌లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్‌లో ఒక్కో జట్టు ఆరేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్‌లో భారత్ 59-57తో పైచేయి సాధించగా… రెండో రౌండ్‌లో 57-59తో, మూడో రౌండ్‌లో 53-58తో వెనుకబడిపోయింది.
చివరిదైన నాలుగో రౌండ్‌లో భారత్ 59-55తో ఆధిపత్యం చలాయించినా ఓవరాల్‌గా ప్రత్యర్థి స్కోరుకు ఒక పాయింట్ దూరంలో ఉండిపోయింది.