గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జులై 2022 (20:34 IST)

ఏడేళ్ల బాలుడి వేలు విరిచిన రోబో..!

chess
యంత్రాలతో పెట్టుకుంటే అంతే సంగతులు. రోబో సినిమాలో రోబోతో ఎంతో మేలు జరిగినా, బాగా నష్టం జరిగిందని యంత్రాల వాడుకలో అప్రమత్తత అవసరమని తెలియజేసింది. తాజాగా రష్యాలో జరుగుతున్న చెస్‌ టోర్నమెంట్‌లో అపశృతి జరిగింది. చెస్‌ ఆడుతున్న రోబో 7 ఏళ్ల బాలుడి వేలు విరిచింది. 
 
తన పావును కదపడానికి ఉన్న సమయం పూర్తికాకుండానే, బాలుడు తన పావును కదిలించే ప్రయత్నం చేయడంతో రోబో అతడి వేలును అదిమి పట్టింది. 
 
సిబ్బంది వెంటనే బాలుడు వేలును విడిపించారు. ఈ నెల 19న జరిగిన మాస్కో చెస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, బాలుడి వేళ్లు విరిగిపోయాయని నిర్వాహకులు తెలిపారు.