గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (17:19 IST)

మారడోనానా..? మడోనానా? కన్ఫ్యూజన్.. రెస్ట్ ఇన్ పీస్

Maradona_madona
ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా గుండెపోటుతో మరణిస్తే.. పాప్ సింగర్ మడోన్నాకు నివాళులు అర్పించారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మారడోనా మృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు. 
 
సోషల్ మీడియా మొత్తం మారడోనాకు సంతాపాలతో నిండిపోయింది. అయితే మారడోనాకు, మడోనాకు తెలియని కొందరు అభిమానులు గందరగోళం సృష్టించారు. మారడోనాకు బదులు పాప్ క్వీన్ మడోనాకు నివాళులర్పించారు. 
 
రెస్ట్ ఇన్ పీస్ మడోనా.. నువ్వు మా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటావు అని ఒకరు ట్వీట్ చేయగా.. అసలు నువ్వు ఫుట్‌బాల్ ఆడతావన్న విషయం కూడా నాకు తెలియదు.. నువ్వు అత్యుత్తమ ప్లేయర్స్‌లో ఒకరు అని మరొకరు ట్వీట్ చేయడం విశేషం.
 
ఇంకొకరైతే మరో అడుగు ముందుకేసి రెస్ట్ ఇన్ పీస్ మడోనా.. క్వీన్ ఆఫ్ ఫుట్‌బాల్ అని ట్వీట్ చేశారు. మరొకరు రెస్ట్ ఇన్ పీస్ మడోనా.. నువ్వు అందించిన ట్యూన్లకు కృతజ్ఞతలు బ్రదర్ అని ట్వీట్ చేయడంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోయారు.