మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 7 నవంబరు 2024 (14:36 IST)

పీవీ సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌కు శంకుస్థాపన

PV Sindhu
విశాఖపట్నంలో పివి సింధు సెంటర్‌ బ్యాడ్మింటన్, స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్‌తో క్రీడా రంగానికి మరోసారి తన వంతు కృషికి నాంది పలికింది. ఈ ప్రయత్నం విశాఖపట్నంలో బహుళ క్రీడలతో పాటు విభిన్న క్రీడా విభాగాలలో అథ్లెట్ల పోషణ, సాధికారత కోసం ప్రత్యేక వేదికగా ప్రపంచ స్థాయి సౌకర్యాలాన్నింటిని నెలకొల్పడానికి మొదటి అడుగును సూచిస్తుంది.
 
ఈ అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదిక కోసం సింధు, టీమ్ PVS స్థానిక సవాళ్లను ఎదుర్కొని.., ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, పోలీస్ కమిషనర్ బాగ్చి, విశాఖపట్నం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అందించిన అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో వీరందరి మద్దతుతో దేశ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల ఆకాంక్షలకు అనుగుణంగా సింధు కలను సాకారం చేయడంలో సహాయపడింది. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్‌ను పర్యవేక్షించేందుకు పెవిలియన్ ఇన్‌ఫ్రా, కార్తీక్‌లకు బాధ్యతలను అప్పగించారు.
 
ఈ సందర్భంగా పివి సింధు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ... " వైజాగ్‌లోని ప్రజల కోసం ఈ అద్భుత కేంద్రాన్ని నిర్మిస్తున్నందుకు నిజంగా నేను కృతజ్ఞురాలిని. నా ఈ లక్ష్యానికి ఒక స్థానాన్ని ఎంపిక చేసుకోవడానికి అద్భుతమైన వైజాగ్ నగరం కంటే మెరుగైన స్థలాన్ని నేను ఊహించలేకపోయాను. ఈ కేంద్రం అన్ని స్థాయిల అథ్లెట్లతో, అంకితభావం, క్రమశిక్షణ నుండి వచ్చే నూతన తరాన్ని క్రీడా నైపుణ్యాలున్న భవిష్యత్ కోసం మార్గనిర్దేశం చేసేందుకు ఒక గమ్యస్థానంగా, అంతే కాకుండా ఈ ప్రయాణంలో మంచి సలహాదారులను, నిపుణులను పొందే స్థలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా నా ఆలోచనలను ప్రతిబింబించే ఈ ప్రాజెక్ట్... ఓలంపియన్‌గా నన్ను నిలబెట్టి, నా ప్రయాణానికి మద్దతునిచ్చిన క్రీడా సమాజానికి మళ్లీ తిరిగి ఏదైనా ఇవ్వాలనే నా ధృఢ సంకల్పంతో రూపుదిద్దుకున్నది.
 
ముఖ్యంగా యువ క్రీడాకారులు ప్రపంచ స్థాయి శిక్షణ పొందడంతో పాటు, వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన మద్దతును అందించగలిగేత క్రీడా శిక్షణ వేదికను నిర్మించాలని కలలు కన్నాను. ఈ కేంద్రం కేవలం సదుపాయాలను అందించడానికి మాత్రమే కాకుండా విభిన్న ప్రణాళికలను ఏర్పాటు చేశాం. భారతీయ బ్యాడ్మింటన్... ఫలితాల పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నందున, తదుపరి తరానికి దారి చూపడం, మార్గనిర్దేశం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. BAI, SAI నుండి అథ్లెట్లు పొందుతున్న అద్భుతమైన మద్దతుతో, నేను ఒక వైవిధ్యమైన ప్రస్థానాన్నీ అందించగలనని భావిస్తున్నాను. భారతీయ బ్యాడ్మింటన్‌ను మరింత అభివృద్ధి చేయడమే  కాకుండా మొత్తంగా మన దేశంలో క్రీడల వృద్ధికి దోహదపడేలా ఒక వైవిధ్యాన్ని సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను.
 
ఈ ప్రయత్నంలో "గ్రీన్‌కో"తో విలువైన భాగస్వామ్యం కీలకంగా తోడ్పాటును అందించింది. ఈ భాగస్వామ్యం నిబద్ధత, తిరుగులేని మద్దతు అందించడంతో నా ఆలోచనలు కార్య రూపం దాల్చడంతో నా ప్రయత్నానికి జీవం పోసింది. గ్రీన్‌కో భాగస్వామ్యంతో పాటు గోపి అంకుల్ అందించే దృఢమైన మద్దతుతో ఈ కేంద్రం శ్రేష్ఠతతో వైవిధ్యమైన అవకాశాలను కల్పిస్తుందని విశ్వసిస్తున్నాను" అని సింధూ తెలిపింది.
 
విశాఖపట్నంలోని ఆరిలోవ జంక్షన్‌లో జరిగిన ఈ శంకుస్థాపన వేడుక సింధు కెరీర్‌లో ఒక ప్రధాన మైలురాయిని, తరువాతి తరం అథ్లెట్లను వృద్ధి లోకి తీసుకురావడంలో ఆమె నిబద్ధతను సూచిస్తుంది. ఈ కేంద్రం భవిష్యత్ ఛాంపియన్‌లకు వారి కలలను సాకారం చేసే దిశగా మార్గనిర్దేశం చేయడం, విభిన్న క్రీడలలో ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క ఉనికిని పెంపొందించాలనే ఆమె దృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది.