బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (12:16 IST)

సానియా కోసం ఏడుస్తున్న కుమారుడు ఇజహన్..

Sania Mirza
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఫార్మలిటీ న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. మరోవైపు షోయబ్ మాలిక్ మేనేజ్మెంట్ డిపార్ట్‌మెంట్‌లో సభ్యుడు ఒకరు కీలక విషయాన్ని వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే ప్రస్తుతం సానియా దుబాయిలో ఉండగా.. షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కుమారుడు ఇజహన్ మాత్రం తండ్రి వద్దే వుంటున్నాడని.. సానియా కోసం ఏడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
 
అయితే విడాకులు తీసుకుంటే కొడుకు తండ్రికే చెందుతాడు. ఈ ప్రకారంగా షోయబ్ మాలిక్ తన కొడుకుని తన దగ్గరే ఉంచుకున్నట్లు సమాచారం వస్తోంది. తల్లిదండ్రులు విడిపోవడం ఆ బిడ్డకు ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి.