త్వరలో విడాకులు తీసుకోబోతున్న సానియా-షోయబ్ మాలిక్?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. స్టార్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఈ రెండు పేర్లు 2010లో క్రీడాలోకంలో సంచలనం సృష్టించాయి.
భారతీయ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ పై మనసుపడి పెళ్ళి చేసుకోవడం అప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విడిపోతోన్న సెలబ్రిటీల లిస్ట్‌లో ఇప్పుడు సానియా, మాలిక్‌లు చేరిపోయారంటూ ప్రచారం జరుగుతోంది.
సానియా మీర్జా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్టార్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణులలో కూడా ఒకటి. డబుల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఆమె ఖాతాలో 6 డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.
మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-100కి చేరుకున్న ఏకైక భారతీయురాలు. 2007లో సానియా 27వ ర్యాంకుకు చేరుకుంది. భారత టెన్నిస్ స్టార్ అయిన సానియా… పాకిస్తాన్‌కు కోడలు అయ్యింది.
ప్రముఖ పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా 'వేర్ డూ బ్రోకెన్ హార్ట్స్ గో' అంటూ సానియా రెండు రోజుల క్రితం పెట్టిన పోస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై వచ్చిన ప్రశ్నలకు సానియా, షోయబ్ మౌనం అనుమానాలను బలపరుస్తోంది.