శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2016 (19:14 IST)

జేఎన్‌యూలో జాతి వ్యతిరేకత : యోగేశ్వర్ దత్ రాసిన ట్విట్టర్ పద్యానికి ప్రశంసల జల్లు!

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో జాతి వ్యతిరేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ యోగేశ్వర్ దేశభక్తితో స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశభక్తిపై యోగేశ్వర్ దత్ రాసిన పద్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు అమర వీరుడైతే లాన్స్ నాయక్ హనుమంతప్ప ఏమవుతారో చెప్పాలని యోగేశ్వర్ ప్రశ్నించడంతో దేశభక్తుల హృదయాలు ఆర్ధ్రమయ్యాయి. మనసుకు హత్తుకునేలా, రాజకీయ నాయకులను మేలుకొలిపేలా ఈ పద్యాన్ని రాశారని అనేక మంది ప్రశంసిస్తున్నారు.
 
జవాన్లు ఎవరి కోసం ప్రాణాలర్పిస్తున్నారు? క్రీడాకారులు ఎవరికోసం చెమటోడుస్తున్నారు? అని యోగేశ్వర్ తన పద్యంలో ప్రశ్నించారు. ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేవారి నోటికి తాళం వేయాలని యోగేశ్వర్ దత్  పేర్కొన్నారు. భారత దేశంలో జన్మించి.. ఈ దేశాన్ని ప్రేమించేవారిని గౌరవించాలని తెలిపారు.
 
కాగా జేఎన్‌యూలో ఏర్పడిన ఘటనకు రాజకీయవేత్తలు మద్దతు పలుకుతుంటే క్రీడాకారుడిగా ఈ చర్యల్ని ఖండిస్తూ.. యువతలో దేశభక్తిని పురిగొల్పించేలా ఉండే నీ పద్యము అదుర్స్ అంటూ అనేకమంది యోగేశ్వర్ దత్‌ను కొనియాడుతూ ట్వీట్స్ చేస్తున్నారు.