శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (14:01 IST)

15 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ తన్వీ శర్మపై ప్రధాని ప్రశంసల జల్లు

Tanvi Sharma
Tanvi Sharma
పంజాబ్‌కు చెందిన 15 ఏళ్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తన్వీ శర్మపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 2023 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో జాతీయ - అంతర్జాతీయ స్థాయిలలో ఆమె అద్భుత ప్రదర్శన చేసినందుకు గాను ప్రధాని కొనియాడారు. 2023 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తన్వీ శర్మ స్వర్ణం సాధించింది.  
 
మలేషియాలో జరిగిన సీనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పతకం కొల్లగొట్టింది. ఈ సందర్భంగా మోదీ 15 ఏళ్ల క్రీడాకారిణికి రాసిన లేఖలో హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యువ తరానికి తన్వి పోషిస్తున్న స్ఫూర్తిదాయకమైన పాత్రను ప్రధాని నొక్కిచెప్పారు. ఆమె విజయం నిస్సందేహంగా దేశవ్యాప్తంగా ఔత్సాహిక క్రీడాకారులను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.