బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 మే 2018 (13:37 IST)

పాకిస్థాన్ హాకీ గోల్ కీపర్ మన్సూర్ అహ్మద్ కన్నుమూత..

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ హాకీ గోల్‌గీపర్ మన్సూర్ అహ్మద్ (49) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ వచ్చిన మన్సూర్ అహ్మద్.. భారత్‌‍లో ఆపరేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంతలోనే నేషనల్ ఇన

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ హాకీ గోల్‌గీపర్ మన్సూర్ అహ్మద్ (49) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ వచ్చిన మన్సూర్ అహ్మద్.. భారత్‌‍లో ఆపరేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంతలోనే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్‌లో చికిత్స పొందుతూ వచ్చిన మన్సూర్ కన్నుమూశారు. 
 
మన్సూర్ మృతికి పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ సంతాపం వ్యక్తం చేసింది. ఇంత చిన్నవయసులోనే అతని మృతి చెందడం హాకీ రంగానికి తీరని లోటని పేర్కొంది. కాగా పాకిస్థాన్ హాకీకి ప్రాతినిథ్యం వహించిన మన్సూర్ 338 అంతర్జాతీయ మ్యాచ్‌లాడాడు. పాకిస్థాన్ జట్టు ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడని పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ కార్యదర్శి షాబాజ్ అహ్మద్ పేర్కొన్నారు. 
 
హాకీ అభివృద్ధికి, జూనియర్ ఆటగాళ్లకు మెళకువలు నేర్పడంలో మన్సూర్ పాత్ర మరువలేనిదని షాబాజ్ తెలిపారు. 1994 ప్రపంచకప్ సాధనలో ఆయన చూపించిన ప్రతిభను ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా జర్మనీ, హాలెండ్ దేశ ఆటగాళ్ల పెనాల్టీ షూటవుట్‌లను అడ్డుకోవడంలో ఆయన దిట్ట అని ప్రశంసలు కురిపించారు. 
 
మన్సూర్ అనారోగ్య పరిస్థితిపై తాము ప్రభుత్వాన్ని సంప్రదించామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడమే కాక, అతనికి ఆర్థికంగా సహాయం అందించిందని షాబాజ్ అహ్మద్ వివరించారు. ఆయన మృతి హాకీ క్రీడారంగానికి తీరని లోటని ఆయన విచారం వ్యక్తం చేశారు.