బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (09:17 IST)

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఇకలేరు...

pele
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూశారు. ఆయన వయసు 82 యేళ్లు. ఆయన పూర్తిపేరు ఎడ్సన్ ఆరాంట్స్ డో నాసిమియాంటో. గత కొన్నేళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయనకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, పరిస్థితి విషమించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగర్ అభిమానులను ఉర్రూతలూగించిన పీలే.. బ్రెజిల్ జట్టు గెలిచిన మూడు ప్రపంచ ఫట్‌బాల్ కప్ విజయాల్లో పాలు పంచుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు.
 
నాలుగు ప్రపంచ కప్ పోటీల్లో పీలే ప్రాతినిథ్యం వహించాడు. గత 1958, 1962, 1970లలో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొని ప్రపంచ కప్‌లు అందుకున్నాడు. ప్రత్యర్థి వేగాలను పసిగట్టి మెరుపు వేగంతో బంతిని గోల్ పోస్టులోకి నెట్టడంలో పీలేకు మించినవారు లేరని చెప్పొచ్చు. 
 
నిజానికి 1966లోనే ఫుట్‌బాల్ ఆటకు స్వస్తి చెప్పాలని భావించాడు. కానీ, తన నిర్ణయాన్ని మార్చుకుని జట్టులో కొనసాగి 1970లో ప్రపంచ కప్ పోటీల్లో అత్యుత్తుమ ఆటగాడిగా బంగారు బూటును అందుకున్నాడు. 
 
ప్రపంచ కప్ పోటీల్లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 12 గోల్స్ చేశాడు. కాగా, పీలే మృతికి సాకర్ ప్రపంచం నివాళులు అర్పిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.