మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (12:54 IST)

జపాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ నుంచి భార‌త్ ఔట్...

జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత్ ఇంటి ముఖం పట్టింది. ఎంతో శ్రమించి సెమీస్‌కు చేరుకున్న మిక్స్‌డ్ డ‌బుల్స్ జంట ప్ర‌ణ‌వ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డీలు ఓడిపోవ‌డంతో జ‌పాన్ సిరీస్‌లో భార‌త్ క్రీడాకారులంద

జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత్ ఇంటి ముఖం పట్టింది. ఎంతో శ్రమించి సెమీస్‌కు చేరుకున్న మిక్స్‌డ్ డ‌బుల్స్ జంట ప్ర‌ణ‌వ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డీలు ఓడిపోవ‌డంతో జ‌పాన్ సిరీస్‌లో భార‌త్ క్రీడాకారులంద‌రూ నిష్క్ర‌మించిన‌ట్లైంది. 
 
జ‌పాన్ జంట త‌కురో హోకి, స‌యాక హిరోటాల చేతిలో వీరు ఓట‌మి పాల‌య్యారు. జపాన్ ఓపెన్ సిరీస్‌లో త‌ప్ప‌కుండా ప‌త‌కం సాధిస్తుంద‌నే అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన పీవీ సింధు ఓపెనింగ్ రౌండ్‌లో ఓడిపోగా, ఆ తర్వాత సైనా నెహ్వాల్ కూడా ఓపెనింగ్‌లోనే ఓడిపోయింది. 
 
క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌కి చేరుకున్న కిడంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్ర‌ణయ్‌లు విక్ట‌ర్ అక్సెల్స‌న్‌, షి యూకీ చేతుల్లో ఓడిపోయారు. దీంతో జపాన్ సూపర్ సిరీస్‌లో భారత్ కథ ముగిసింది.