శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జులై 2023 (11:46 IST)

వింబుల్డన్‌లో మెరిసిన రోహన్ బోపన్న జోడీ..

rohan bopanna
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన వింబుల్డన్ టెన్నిస్ సిరీస్ లండన్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన రోహన్ బోపన్న-ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ జోడీ నెదర్లాండ్స్‌కు చెందిన క్రీగ్‌స్పూర్-బార్ట్ స్టీవెన్స్ జోడీతో తలపడింది. 
 
ఇందులో రోహన్ బోపన్న జోడీ 6-7 (3-7), 7-5, 6-2తో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 43 ఏళ్ల బోపన్న వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి కావడం గమనార్హం.