మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (11:47 IST)

ఇద్దరమ్మాయిలతో రొనాల్డినో పెళ్లి.. సవతి పోరు లేదట.. అందుకే?

బ్రెజిల్ ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డినో ఇద్దరమ్మాయిలతో సంసారం సాగించనున్నాడు. ఫుట్‌బాల్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రొనాల్డినో.. తాను సహజీవనం చేస్తున్న ఇద్దరు యువతులనూ ఒకేసారి వివా

బ్రెజిల్ ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డినో ఇద్దరమ్మాయిలతో సంసారం సాగించనున్నాడు. ఫుట్‌బాల్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రొనాల్డినో.. తాను సహజీవనం చేస్తున్న ఇద్దరు యువతులనూ ఒకేసారి వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించాడు.


ఆగస్టులో తాను ఒకేసారి ప్రిసిల్లా కోయిల్హో, బీట్రెజ్ సౌజాలను పెళ్లాడతానని స్పష్టం చేశాడు. అయితే ఇద్దరమ్మాయిలతో సంసారం ఎలా చేస్తాడోనని రొనాల్డినో ఫ్యాన్స్ ఆందోళన చెందుతుంటే.. అందుకు పరిష్కారం వుందని కూడా చెప్పేశాడు. 
 
ఆ ఇద్దరు అమ్మాయిలు రొనాల్డినోతో కలసి రియో డీజనీరోలో ఉన్న ఓ మాన్షన్‌లో గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఉంటున్నారని, అమ్మాయిలిద్దరి మధ్యా ఎటువంటి గొడవలూ లేవని రొనాల్డినో క్లారిటీ ఇచ్చినట్లు బ్రెజిల్ వార్తా సంస్థలు తెలిపాయి. 
 
రొనాల్డినో సైతం వీరిద్దరినీ ఒకేలా చూస్తున్నారని, ఇటీవలి తన విదేశీ పర్యటన తరువాత ఇద్దరికీ ఒకే రకమైన పర్ఫ్యూమ్ తెచ్చిచ్చాడని తెలుస్తోంది. ఇద్దరమ్మాయిలతో రొనాల్డినో పెళ్లికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు రానున్నారట. రియోలోని శాంటా మొనికా కండోమినియంలో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.