బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (15:11 IST)

సాక్షి మాలిక్‌కు హర్యానా రూ.2.5 కోట్ల బహుమానం.. సర్కారీ కొలువు కూడా...

రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించి పెట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా, హర్యానా ప్రభుత్వం ఆమెకు ఏకంగా రూ.2.50 కోట్ల బహుమానం అందజేయ

రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించి పెట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా, హర్యానా ప్రభుత్వం ఆమెకు ఏకంగా రూ.2.50 కోట్ల బహుమానం అందజేయనున్నట్టు ప్రకటించింది. 
 
బుధవారం రాత్రి రియోలో జరిగిన మహిళల 58 కిలోల రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ పోటీల్లో సాక్షి కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన సాక్షి మాలిక్‌కు హర్యానా ప్రభుత్వం రూ.2.5 కోట్ల నజరానా ప్రకటించింది. అంతేకాకుండా ఆమెకు ప్రభుత్వోద్యోగం కల్పిస్తామని పేర్కొంది. 
 
మరోవైపు కాంస్యం సాధించిన రెజ్ల‌ర్ సాక్షి మాలిక్‌పై ప్ర‌శంస‌లజ‌ల్లు కురుస్తోంది. ప్ర‌ముఖ క్రీడాకారులు, రాజ‌కీయవేత్త‌లు, సినీ న‌టులు ఆమెకు ట్విట్ట‌ర్‌లో కంగ్రాట్స్ తెలుపుతూ మెసేజ్ చేశారు. రోహ‌త‌క్ రెజ్ల‌ర్ సాక్షి 58 కేజీల ఫ్రీ స్ట‌యిల్‌లో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. సాక్షి మాలిక్ చ‌రిత్ర సృష్టించింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. రియో క్రీడ‌ల్లో జాతీయ ప‌తాకంతో ర్యాలీలో పాల్గొన్న అభిన‌వ్ బింద్రా కూడా ఆమెకు విషెస్ చెప్పాడు. దేశ ప్ర‌జ‌ల్లో స్ఫూర్తిని నింపిందని కొనియాడారు.