శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జులై 2021 (13:02 IST)

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌- భారత్ శుభారంభం

Tennis
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు శుభారంభం చేశారు. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి కలిసి చైనీస్ తైపీ జట్టును 21-16, 16-21, 27-25 సెట్ల తేడాతో ఓడించారు. మరోవైపు టెన్నీస్‌లోనూ భారత్ అదరగొట్టింది. భారత ఆటగాడు సుమిత్ నగాల్ తొలి రౌండ్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన డెనిస్ ఇస్తోమిన్‌పై 6-4, 6-7, 6-4 తేడాతో గెలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.
 
ఇకపోతే.. ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌ పోరు ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన దీపిక కుమారి, ప్రవీణ్‌ జాదవ్‌ జంట కొరియా చేతిలో​ 2-6 తో ఓడిపోయి నిష్క్రమించింది. నాలుగు సెట్లుగా జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కొరియా గెలుచుకోగా.. మూడోది భారత్‌ గెలుచుకుంది. చివరిదైన నాలుగో సెట్‌ను కొరియా గెలవడంతో సెమీస్‌కు చేరుకుంది.
 
పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌదరీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. పురుషుల 10 మీ. ఎయిర్‌ పిస్టల్ విభాగంలో సౌరభ్‌ చౌదరీ ఆరు రౌండ్లు కలిపి మొత్తం 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఫైనల్స్‌లో కూడా సౌరభ్‌ ఇదే ప్రదర్శన చేస్తే భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో తొలి పతకం వచ్చే అవకాశం ఉంది. ఇక మరో భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ 575 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచాడు.