మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:47 IST)

డేవిస్ కప్‌లో అదరగొట్టిన సోమదేవ్ దేవ్‌వర్మన్!

డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత స్టార్ ప్లేయర్ సోమదేవ్ దేవ్ సంచలనం సృష్టించాడు. సోమదేవ్ అద్భుత ప్రదర్శనతో యూకీ బాంబ్రీపై సంచలన విజయం సాధించాడు. భారత్‌కు సెర్బియాను ఓడించి ముందంజ వేయడం సాధ్యమా కాదా అన్నది వర్షం కారణంగా స్పష్టం కాలేదు. అత్యంత కీలకమైన చివరి రివర్స్ సింగిల్స్‌లో యుకీ బాంబ్రీ ఒ సెట్ వెనుకంజలో నిలవగా, వర్షం వల్ల ఆటను ఆపేశారు. అర్ధరాత్రి వరకు మ్యాచ్ మళ్లీ మొదలు కాలేదు.
 
మొదటి రెండు సింగిల్స్ మ్యాచ్‌లను చేజార్చుకొని 0-2 తేడాతో వెనుకబడిన భారత్‌ను డబుల్స్ విభాగంలో లియాం డర్ పేస్, రోహన్ బోపన్న విజయంతో ఆదుకున్నారు. ఆదివారం నాటి రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల‌ను గెలిస్తే తప్ప సెర్బియాను ఓడించి వరల్డ్ గ్రూప్ పోటీలకు అర్హత సంపాదించలేని స్థితిలో ఉన్న భారత్‌కు సోమ్‌దేవ్ దేవ్‌వర్మ అండగా నిలిచాడు. దుసాన్ లజొవిక్‌తో జరిగిన మ్యాచ్‌ని అతను 1-6, 6-4, 4-6, 6-3, 6-2 తేడాతో సంచలన విజయాన్ని సాధించి స్కోరును సమం చేశాడు.