శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:51 IST)

భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ సంచలనం: ఫైనల్లోకి ఎంట్రీ

ఒలింపిక్స్‌లో భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ సంచలనం సృష్టించింది. శుక్రవారం మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 3లో ఆమె రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 
 
అమెరికాకు చెందిన నెల్లి కొర్డా 198 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ గోల్ఫ్ ఈవెంట్‌లో ఎవరైతే తక్కువ పాయింట్లు సాధిస్తారో వారే మొదటి స్థానంలో ఉంటారు. అయతే శుక్రవారం జరగాల్సిన రౌండ్ 4 వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారానికి వాయిదా పడింది. 
 
ఒకవేళ శనివారం కూడా పోటీలు జరగకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి రజతం ఖాయమవుతుంది. ఒకవేళ పోటీలు జరిగినా అదితికి కనీసం కాంస్యం వచ్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత గోల్ఫర్గా అదితి అశోక్ చరిత్ర సృష్టిస్తుంది.