సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: బుధవారం, 21 నవంబరు 2018 (11:59 IST)

తెలంగాణలో బీజేపీని కుళ్లబొడుస్తున్న అభ్యర్థులు... కాసాని ఝలక్..

బీజేపీ కుత్బుల్లాపూర్ అభ్యర్థి కాసాని వీరేశం పోటీ నుండి తప్పుకున్నారు. మొన్ననే ఢిల్లీ బీజేపీ పెద్దల ద్వారా పార్టీ లోకి వచ్చిన కాసాని వీరేశంకు బి ఫార్మ్ ఇచ్చింది. అయితే ఆయన తండ్రి కాసాని జ్ఞానేశ్వర్‌కి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ టికెట్ ఇచ్చింది. దాంతో మనసు మార్చుకున్న వీరేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకుంటున్నారు. 
 
ఎవరి ద్వారా బీజేపీలోకి వచ్చారో ఆయనకు సమాచారం పంపించారు. కాగా తెలంగాణ బీజేపీ, ఢిల్లీ బీజేపీ నేతలు ఫోన్ చేసిన కాసాని వీరేశం అందుబాటులోనికి రాలేదు. అయితే ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మిణి విషయంలో భంగపడ్డ బీజేపీకి ఇప్పుడు మరో షాక్ తగిలింది.