మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (12:20 IST)

కేసీఆర్.. నీ కూతురు బెడ్‌రూమ్‌లోకి పోలీసులు వస్తే ఊరుకుంటావా?: జైపాల్ రెడ్డి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్‌లో రేవంత్ అరెస్ట్‌ను ఖండించారు. 
 
రేవంత్ రెడ్డి బెడ్‌రూమ్ వరకు వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. నోటీసులు లేకుండా నీ కుమార్తె కవిత బెడ్‌రూమ్ బద్ధలుకొట్టి పోలీసులు లోపలికి వస్తే కేసీఆర్ ఊరుకుంటారా అంటూ జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గపు చర్య అంటూ జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
 
రేవంత్ రెడ్డి బంద్‌కు పిలుపునివ్వలేదని.. కేవలం కొన్ని ప్రాంతాల్లో నిసరన తెలిపేందుకు సిద్ధమయ్యారని జైపాల్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం అధికారులు,  పోలీసులు కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని.. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తామని జైపాల్ రెడ్డి తెలిపారు. సీఎం కోస్గి వస్తున్నారని.. నిరసన కార్యక్రమాలు కోస్గికి అవతల జరిపేందుకు కాంగ్రెస్ పిలుపునిచ్చిందన్నారు. 
 
నిరంకుశ అధికారంతో నాలుగేళ్ల పాటు ఫామ్‌హౌస్‌‍లో ప్రశాంతంగా ఉన్న కేసీఆర్‌కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందన్నారు. లేకలేక సీఎం అయిన కేసీఆర్ నికృష్టంగా వ్యవహరిస్తున్నారని జైపాల్ రెడ్డి మండిపడ్డారు.