శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (17:07 IST)

ఆరు నెలల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు... కడియం శ్రీహరి

kcrcm
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రెండు రోజుల కిందటే వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. 
 
ప్రస్తుతం ఆ పార్టీ విపక్షంగా వ్యవహరించనుంది. తెలంగాణ ఎన్నికల్లో సీనియర్ నేతలు, మంత్రులు కూడా చాలా చోట్ల ఓడిపోయారు. ఈ ఘోర పరాజయాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
బీఆర్ఎస్ నేతలు ఎవరూ అసహనానికి గురికావద్దని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని అన్నారు ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కడియం శ్రీహరి విజయం సాధించారు. ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ నేతలకు నచ్చజెప్పేందుకు ఈ వ్యాఖ్యలు చేశారు.
 
కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 'ఆరు నెలల్లోగానీ, ఏడాదిన్నరలోగానీ మళ్లీ అధికారంలోకి వస్తాం. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు. " అని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బి.ఆరోగిపై 40,051 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా, పూర్తి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతోంది.