సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (11:51 IST)

కామారెడ్డిలో కేసీఆర్- సిరిసిల్లలో కేటీఆర్ ముందంజ

kcrcm
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనేత రేవంత్ రెడ్డిపై, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముందంజలో నిలిచారు. తొలుత కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా, ఆ తర్వాత సీఎం కేసీఆర్ పుంజుకున్నారు. ఐదో రౌండ్ కు వచ్చేసరికి రేవంత్ రెడ్డిని కేసీఆర్ అధిగమించారు. 
 
కామారెడ్డిలో ఐదో రౌండ్ ముగిసేసరికి సీఎం కేసీఆర్‌కు 660 ఓట్ల ఆధిక్యం లభించింది. నాలుగో రౌండ్ వరకు రేవంత్ ముందంజలో ఉన్నప్పటికీ, ఐదో రౌండ్‌లో మొగ్గు కేసీఆర్ వైపు కనిపించింది.  
 
అటు, గజ్వేల్ నియోజకవర్గంలోనూ కేసీఆర్ ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్ల అనంతరం కేసీఆర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. 
 
3వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి కేటీఆర్ 2,621 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేటీఆర్‌కు 10,199 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి 7,578 ఓట్లు పొందారు. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమకు 2,763 ఓట్లు వచ్చాయి.