1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. 5.02 Crore Assets Seized from Warangal Tahsildar

వామ్మో.. వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఆస్తులు విలువెంతంటే?

Assets
Assets
ఫోర్ట్ వరంగల్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వరరావు వద్ద రూ.5.02 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం వెలికితీసింది. తన సర్వీసులో అవినీతి కార్యకలాపాలు, అనుమానాస్పద మార్గాలకు పాల్పడటం ద్వారా తన చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి ఆస్తులను సంపాదించినందుకు బండి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసింది. బండి నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యుల ఇల్లు, కార్యాలయం, ఇతర  ఏడు ప్రదేశాలలో అధికారులు సోదాలు నిర్వహించారు. 
 
ఈ సోదాల్లో ప్రాథమికంగా అతని ఆయన వద్ద రూ.1.15 కోట్ల విలువైన ఇళ్ల ఆస్తులు, రూ.1.42 కోట్ల విలువైన 17 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి పత్రాలు, రూ.23.84 లక్షల విలువైన 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.92.000 విలువైన 1.791 గ్రాముల వెండి వస్తువులు, రూ.34.78 లక్షల విలువైన రెండు కార్లు, ఒక బైక్, రూ.3.28 లక్షల విలువైన 23 చేతి గడియారాలు, రూ.16.43 లక్షల విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆస్తుల మొత్తం విలువ రూ.5.02 కోట్లు. 
 
అదనపు ఆస్తులపై మరింత తనిఖీ జరుగుతోందని, ప్రస్తుత మార్కెట్ విలువలు ప్రభుత్వ అంచనా కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఎసిబి అధికారులు తెలిపారు. ఇంకా బండి నాగేశ్వర రావును అరెస్టు చేసి వరంగల్‌లోని ఎసిబి కేసుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్.. క్రీడా కోటాను 3 శాతానికి ఏపీ పెంచుతుంది