బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 మార్చి 2024 (12:39 IST)

ప్రైవేటు భూమి కాదు రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు

Land grab
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ ప్రాంతంలో రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు ఓ ఘనుడు. తన స్థలాన్ని ఆనుకుని వున్న స్థలం కావడంతో ఎంచక్కా దాన్ని కలిపేసుకుని అందులో గదులు నిర్మించేసాడు. ఆటలు ఆడుకునేందుకు క్రీడామైదానంగా తీర్చిదిద్ది దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించాడు. ఈ వ్యవహారం జూబ్లిహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్ 1లో జరిగింది.
 
ప్రభుత్వ భూమిని కబ్జా చేసాడన్న ఫిర్యాదు అందడంతో రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఐతే ఆ స్థలం లోపలికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ముందు వున్న పురుషోత్తం రెడ్డి ఇంటి గేటు ద్వారా వెళ్లేందుకు అధికారులు ప్రయత్నించారు. దానితో తన ఇంటి ఆవరణ గేటులోపలికి వచ్చేందుకు అనుమతి నిరాకరించడంతో వారు పక్కనే వున్న కొండ ప్రాంతం పైకి ఎక్కి ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని ఫోటోలు తీసారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.