శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (17:02 IST)

Amberpet: కాపీ కొట్టి దొరికిపోయారు.. టీచర్, పారెంట్స్ తిట్టారని ఇంటి నుంచి వెళ్ళిపోయారు..

missing
missing
హైదరాబాద్ అంబర్‌పేట్‌కి చెందిన నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు 19వ తేదీ నుంచి కన్పించకుండా పోయారు. అంబర్ పేట్, ప్రేమ్ నగర్‌కు చెందిన అజమత్, తేజ్ నాథ్ రెడ్డి, నితీష్ చౌదరి, కోరే హర్ష అనే 13 ఏళ్ల నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీరు నలుగురు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఈ నలుగురు విద్యార్థులు చదువుతున్నారు. 
 
స్కూల్ పరీక్షలల్లో కాపీ కొడుతూ టీచర్స్‌కి దొరికారు. దీంతో వారిని మందలించి.. పేరెంట్స్‌కి విషయం చెప్పారు. పేరెంట్స్ కూడా మందలించడంతో నలుగురు కలిసి ఇళ్లలో నుండి వెళ్లిపోయారు. వెంటనే అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో సీసీ కెమెరాల ఆధారంగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.