మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డి (వీడియో)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావును ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఇందుకోసం ఆయన గురువారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి ప్రత్యేక విమానంలో వెళ్లారు. అక్కడ నుంచి కేసీఆర్ ఉంటున్న బంజారా హిల్స్‌లోని నందినగర్ నివాసానికి చేరుకుని పరామర్శించారు.
ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.