సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 మార్చి 2024 (11:52 IST)

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎఎస్ఐ

Affair
మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎఎస్ఐను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే పోలీస్ స్టేషన్లో ఎఎస్ఐ వి. రామయ్య కూడా విధులు నిర్వహిస్తుండంతో సదరు బాధిత మహిళతో పరిచయం ఏర్పడింది.
 
బాధితురాలికి తగు న్యాయం చేస్తానని ఆమెను నమ్మించి, సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకుని ఆమెతో సన్నిహింతగా వుంటూ అక్రమ సంబంధం కొనసాగించాడు. తాను బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరు మహిళను పిలిపించుకొని ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు.
 
ఎఎస్ఐ రాసలీలలు స్థానిక సామజిక మధ్యామాల్లో ప్రచారం జరగడంతో విచారణ జరుపగా ఎఎస్ఐ పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా ఎఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి. రంగనాథ్ వెల్లడించారు.