సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జనవరి 2024 (11:33 IST)

16 శతాబ్దంనాటి భక్తరామదాసు విగ్రహం.. ఎక్కడ దొరికిందో తెలుసా?

Ramadas
Ramadas
తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్తరామదాసునిగా చెప్తున్న 16 శతాబ్దంనాటి విగ్రహాన్ని గుర్తించారు. దేశమంతా రామనామ స్మరణలో మునిగితేలుతున్న సమయంలో భక్తరామదాసు విగ్రహం బయటికి రావడం రామ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌‌లోని ఓ రావిచెట్టు కింద ఈ విగ్రహం వుంది. 
 
ఇటీవల ఓ వ్యక్తి ఈ విగ్రహాన్ని ఫొటో తీసి "కొత్త తెలంగాణ చరిత్ర" బృందం సభ్యుడు  రామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్‌కు పంపాడు. వెంటనే వారొచ్చి విగ్రహాన్ని పరిశీలించి ఆ విగ్రహం భక్త రామదాసుదేనని నిర్ధారించారు. 
 
నిన్న ఈ విగ్రహాన్ని రామదాసు ధ్యానమందిరానికి తరలించి రామదాసు పదోతరం వారసుడైన కంచర్ల శ్రీనివాసరావు సమక్షంలో క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
 
చక్కని మీసకట్టుతో, అప్పుడే తలారా స్నానం చేసి జుట్టును జారుముడి వేసుకున్న గోష్పాద శిఖ, అంజలి ముద్ర, నడుము పక్కన కత్తి, కుడిఎడమ భుజాలపై శంఖుచక్ర ముద్రలు ఉన్నాయి.