గురువారం, 20 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మే 2024 (13:58 IST)

రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించడం మూర్ఖపు నిర్ణయం : కేటీఆర్

ktrao
రాష్ట్ర అధికార చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన దృష్ట్యా భారాస నేతలు చార్మినార్‌ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
 
'కేసీఆర్‌ పేరు కనిపించకుండా ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయ కక్షతోనే మార్పు చేస్తోంది. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించడం హైదరాబాదీలను విస్మరించడమే. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదు. చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించడం మూర్ఖపు నిర్ణయమే. హైదరాబాద్‌ ఐకాన్‌గా చార్మినార్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొనలేదు. కేసీఆర్‌ పెట్టిన గుర్తులు మార్చాలని ఆయన చూస్తున్నారు. లోగో మార్పుపై బీఆర్ఎస్ తరపున నిరసన కార్యక్రమాలు చేపడతాం' అని కేటీఆర్‌ తెలిపారు.
 
పల్నాడు జిల్లా : వైకాపా నేత గడ్డి వాములో పెట్రోల్ బాంబులు!! 
పల్నాడు జిల్లాలో వైకాపా నేతకు చెందిన గడ్డి వాములో దాచిపెట్టిన పెట్రోల్ బాంబులను గుర్తించారు. ఈ గ్రామంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో గడ్డి వాములో దాచిన పెట్రోల్ బాంబులను గుర్తించారు. మొత్తం నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. కౌంటింగ్‌ రోజు అలజడులు సృష్టించేందుకు వాటిని దాచి ఉంచారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 
 
ఇదే గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 21న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రోడ్డుషో నిర్వహిస్తుండగా వైకాపా వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రోడ్డుకు అడ్డంగా వైకాపా ప్రచార వాహనాలను నిలిపి.. ఇదేమిటని అడిగిన టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అదేరోజు రాత్రి రెండింటి ప్రాంతంలో గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇప్పటికైనా గ్రామంలో అల్లర్లకు పాల్పడేవారిని బైండోవర్‌ చేయకపోతే కౌంటింగ్‌ రోజు దాడులు చేసే అవకాశముందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గడ్డివాము పరిసరాల్లోని నివాసితులను విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై రాజేష్‌ తెలిపారు.