Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్ వద్ద మహిళ మెడలో..? (video)
Chain Snatching in Guntur
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగనూ పెరగనూ దొంగలు పెరిగిపోతున్నారు. భాగ్యనగర్‌లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపుతున్నాయి. నార్సింగిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న 4 ఇళ్లల్లో దొంగతనం జరిగాయి.
ఇదే తరహాలో ఏపీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది.
బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. అనంతరం ఐదు నిమిషాల్లోనే మరో చోట కూడా మహిళ మెడలో బంగారపు గొలుసు తెంపుకెళ్లారు.
ఇకపోతే.. నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. తరచూ ఇలాంటి ఘటనలు జరగడంతో ఇంటి నుంచి బయటికి రావాలంటేనే మహిళలు హడలిపోతున్నారు.