బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (13:24 IST)

ఈ ఏడాది చివరి నాటికి అదనంగా 35,000 ఉద్యోగాలు -రేవంత్ రెడ్డి

Revanth Reddy
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిన రేవంత్ రెడ్డి.. ఈ ఏడాది చివరి నాటికి అదనంగా 35,000 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 
తెలంగాణ పోలీసు అకాడమీలో బుధవారం జరిగిన ఎస్‌ఐ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, కొత్తగా శిక్షణ పొందిన సబ్‌ఇన్‌స్పెక్టర్లకు (ఎస్‌ఐ) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 
 
మరోవైపు దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వలనే ఇవాళ వరదలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఆక్రమణకు గురైన చెరువులను రక్షించేందుకు హైడ్రాను ప్రారంభించినట్లు వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇవాళ శిక్షణ పూర్తి చేసుకున్న నూతన ఎస్సైల ఔట్ పాసింగ్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
 
చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు ఎంత పెద్ద వ్యక్తులవి అయిన వదిలి పెట్టేది లేదన్నారు. తాత్కాలికంగా కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నా, అక్కడ తమ ప్రభుత్వం కొట్లాడి, ఈ ఆక్రమణలను కూల్చుతోందని స్పష్టం చేశారు.