మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (20:54 IST)

తెలుగు రాష్ట్రాల్లో భగభగలు.. విద్యార్థులకు వేసవి సెలవులు

students
తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి పెరగడంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం కోసం ఒక్కరోజు పాఠశాలలు నడుపుతున్నాయి. వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం త్వరలో సమీక్షించి వేసవి సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయి. 
 
ఏప్రిల్ నెలలో పాఠశాలలు, కళాశాలలకు అధిక రోజులు సెలవులు రానున్నాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల నేపథ్యంలో వారం రోజుల్లో వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. దీనికి తోడు ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 17 మధ్య రెండవ శనివారం, ఆదివారం కూడా పాఠశాలలకు వరుస సెలవులు ఉంటాయి. 
 
తెలంగాణకు ఈసారి ఏప్రిల్ 18 లేదా ఏప్రిల్ 20 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. హోలీ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మార్చి 25న కూడా సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగగా.. ఈసారి 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 
 
పరీక్షలు ముగియడంతో ఇప్పటికే ప్రారంభం కాగా పేపర్ వాల్యుయేషన్ వేగంగా జరుగుతోంది. ఏప్రిల్ మూడు లేదా నాలుగో వారంలో ఇంటర్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.