సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:59 IST)

కన్నబిడ్డకు విషమిచ్చారు.. ఆపై దంపతులు కూడా.. కుటుంబం బలి

crime scene
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ కుటుంబం బలైపోయింది. ఆనంద్, ఇందిర అనే దంపతులు సన్ సిటీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వుంటున్నారు. వీరిద్దరూ తమ కుమారుడు శ్రీ హర్షకు విషమిచ్చి హత్య చేసి.. ఆపై దానిని తిని వారిద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఇంట్లో వేర్వేరు చోట్ల శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై బంధువులతో ఆరా తీసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.