ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మార్చి 2024 (23:22 IST)

కవిత అరెస్టు.. ఈడీపై కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు.. బంజారాహిల్స్‌లో కేసు నమోదు

KTR
KTR
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సందర్భంగా తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ అధికారిణి ప్రియా మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ ఈడీ అధికారులకు పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఆమెను అరెస్టు చేయబోమని గతంలో సుప్రీంకోర్టుకు తెలియజేసినా ఎందుకు అరెస్టుకు దిగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
 
శని, ఆదివారాల్లో కోర్టులు మూతపడతాయని తెలిసినా శుక్రవారమే అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.