బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (11:51 IST)

రాంకోఠిలోని హోల్‌సేల్ క్రాకర్స్ దుకాణంలో అగ్నిప్రమాదం (Video)

crackers fire accident
హైదరాబాద్ నగరం రాంకోఠిలోని ఓ హోల్‌సేల్ క్రాకర్స్ దుకాణంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకోఠిలో ఏర్పాటు చేసిన దుకారణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. 
 
దుకారణంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, దీపావళి కోసం విక్రయానికి సిద్ధంగా ఉంచిన టపాసులన్నీ కాలిపోయాయి. ఈ ప్రమాదం దేవాదాయ శాఖ కార్యాలయానికి సమీపంలో చోటుచేసుకుంది. అయితే, ప్రమాదంలో పది ద్విచక్రవాహనాలు కాలిపోయినట్టు తెలుస్తుంది.