ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (15:03 IST)

ఐస్‌క్రీమ్ రూపంలో డ్రగ్స్ సప్లై.. విస్కీ ఐస్‌క్రీమ్‌ల గుట్టు రట్టు

ice cream
హైదరాబాద్‌లో ఎ‌వరికీ అనుమానం రాకుండా ఐస్‌క్రీమ్ రూపంలో డ్రగ్స్ సప్లై చేస్తూ యువతను మత్తుకు అలవాటు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌‌లోని ఓ పార్లర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఈ డ్రగ్ ఐస్‌క్రీమ్‌ల గుట్టురట్టయ్యింది. 
 
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు-1లో వన్‌ అండ్‌ ఫైవ్‌ పార్లర్‌లో ఎక్సైజ్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు బయటపడ్డాయి. ఐస్‌ క్రీమ్‌లో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ఐస్ క్రీమ్‌లో విస్కీ కలిసి అమ్ముతున్న మత్తు మందు ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
60 గ్రాముల ఐస్ క్రీమ్‌లో 100 మిల్లీ లీటర్ల విస్కీని కలుపుతున్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.