హైదరాబాద్ నగరంలో గురువారం కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రధాన రహదారులు నిమిషాల వ్యవధిలో జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. 
				  											
	ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మొదలైన ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో మూడున్నర గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 
				  
	చంపెయ్... గొంతు పిసికి చంపేసెయ్... మనం ప్రశాంతంగా ఉండొచ్చు... ప్రియుడుని ఉసికొల్పిన భార్య
				  																								
	చంపెయ్.. గొంతు పిసికి చంపేసెయ్... మనం ప్రశాతంగా ఉండొచ్చు అంటూ తన ప్రియుడుని ఓ భార్య ఉసికొల్పింది. అయితే, వారి ప్లాన్ వికటించడంతో ఆ మహిళ భర్త ప్రాణగండం నుంచి తప్పించుకోగా, భార్య మాత్రం జైలు ఊచలు లెక్కిస్తోంది. పరారీలో ఉన్న ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా ఇండి తాలూకాలో వెలుగు చూసింది.
				  																		
	ఈ గ్రామానికి చెందిన సునంద అనే మహిళకు బీరప్ప అనే వ్యక్తితో దశాబ్దం కిందటే పెళ్లయింది. అయితే, మరో ఊరికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తితో పెళ్లికి ముందు నుంచే సాన్నిహిత్యం ఉంది. ఆయన మీద చూపే ప్రేమ.. భర్తపైన ప్రదర్శించలేక పోతోంది. జీవితాంతం సిద్దప్ప సొంతం కావాలనే ఆకాంక్ష అంతకంతకూ పెరిగిపోయింది. అందులో భాగంగానే ఓ కుట్రకు తెరలేపింది. 
				  																	
	మోతుబరి రైతు బీరప్ప చక్కగా పొలం పనులు చేసి ఇంటికొచ్చి తన గదిలో ఆదమరిచి నిద్రించే వేళ ఆమె మేల్కొంది. హితుడని విశ్వసించిన సిద్ధప్పకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని సూచించింది. సోమవారం అర్ధరాత్రి వేళ.. వచ్చివాలాడు. మెల్లగా గడితీసి ఆయనను లోపలికి రానిచ్చింది. గదిలో హాయిగా నిద్రపోతున్న భర్తను చూపి.. 'చంపేసెయ్. గొంతు పిసికి చంపేసెయ్. మనం ప్రశాంతంగా ఉండొచ్చు' అంటూ రెచ్చగొట్టింది.
				  																	
	ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న సిద్ధప్ప ఒక్క ఒదుటన బీరప్ప గుండెలపై కూర్చుని గొంతు నులిమి కడతేర్చేందుకు శక్తినంతా ప్రదర్శించాడు. నిత్యం శ్రమటోడ్చే బీరప్ప ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయి లేచి శక్తికొద్దీ ప్రతిఘటించాడు. వారి పోట్లాట సమయంలో మంచం పక్కనే ఉన్న కూలర్ ఒక్కసారిగా ధబేల్ మంటూ కింద పడిపోవడంతో పక్క గదిలో పడుకున్న సునంద కుమారుడు (8) అక్కడికి పరుగున వచ్చాడు. ఆందోళనతో కేకలు పెట్టడంతో సునంద, సిద్ధప్ప భయపడి ఇంట్లోంచి పరుగులు తీశారు. 
				  																	
	ఇలా.. తన వివాహేతర సంబంధానికి భర్త బీరప్ప అడ్డుగా ఉన్నాడని సునంద అనే మహిళ తన ప్రియుడు సిద్ధప్పతో కలిసి హత్యకు విఫలయత్నం చేసిందని పోలీసులు వివరించారు. ఇద్దరూ కలిసి బీరప్పపై దాడి చేస్తుండగా.. ఎనిమిదేళ్ల కుమారుడే రక్షించినట్లయ్యింది. దాడిలో గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం విజయపుర ఆసుపత్రిలో చేర్పించారు. పరారీలో ఉన్న సునందను గాలించి బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సిద్ధప్ప కోసం విజయపుర గ్రామీణ ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.
				  																	
	విజయపుర, న్యూస్టుడే : ఆమె పేరు సునంద. విజయపుర జిల్లా ఇండి తాలూకాలోని ఓ పల్లెవాసి. ఆమెకు బీరప్పతో దశాబ్దం కిందటే పెళ్లయినా.. సిద్ధప్ప అనే వ్యక్తితో సాన్నిహిత్యం ఎక్కువ. ఆయన మీద చూపే ప్రేమ.. భర్తపైన ప్రదర్శించలేక పోతోంది. జీవితాంతం సిద్దప్ప సొంతం కావాలనే ఆకాంక్ష అంతకంతకూ పెరిగిపోయింది. అందులో భాగంగానే ఓ కుట్రకు తెరలేపింది. 