శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (11:56 IST)

గంజాయి మత్తులో బాలిక.. ఐదుగురు యువకుల అత్యాచారం.. ఎక్కడ?

Rape
హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కాచిగూడకు చెందిన బాలికను ఐదుగురు యువకులు ట్రాప్ చేసారు. 
 
బాలికకు గంజాయి అలవాటు చేసి నేరెడ్‌మెట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలిక గంజాయి మత్తులో వుండగానే ఐదుగురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం అక్కడి నుంచి యువకులు పరారయ్యారు. మత్తు నుంచి తేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని ఇంటికొచ్చిన తర్వాత తల్లికి చెప్పింది.
 
దీంతో బాలిత తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.