ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (12:55 IST)

రాత్రిపూట ఆ సమయానికే మద్యం షాపులు బంద్ చేయాల్సిందే.. వ్యాపారుల అసహనం!!

liquor brands
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా మద్యం షాపులను ఇకపై రాత్రి 10.30 నుంచి 11 గంటలకే మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. ఈ కొత్త నిబంధనపై మద్యం వ్యాపారులు తీవ్ర అసహన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రల పరిస్థితిపై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. 
 
ఇటీవలికాలంలో నేరాల తీవ్ర పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రాత్రిపూట అనవసరంగా వీధుల్లో తిరగొద్దని ప్రజలకు పోలీసులు సూచించారు. తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని కోరారు. రాత్రుళ్లు కూడా పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
మరోవైపు, పోలీసులు తీసుకున్న నిర్ణయంపై మద్యం వ్యాపారులతో పాటు స్థానికులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని నైట్‌లైఫ్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. చార్మినార్ పరిసరాల్లో అర్థరాత్రి వరకు జనాల సందడి ఉంటుందని స్థానిక వ్యాపారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం నేరాలకు నియంత్రించాలి కానీ ఈ దిశగా చేపట్టే చర్యలతో ప్రజలకు నష్టం కలగకూడదని పేర్కొన్నారు. 
 
నగర ప్రజల అభిరుచులు మారుతున్నాయని, సాయంత్రం వేళల్లో కుటుంబంతో సహా విహరించేందుకు ఆసక్తి చూపుతున్నారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా మారాల్సి ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. షాపులు మూసేసే సమయంలో అనేక మంది కస్టమర్లు హడావుడిగా షాపులకు వస్తుంటారని, కాబట్టి అర్థరాత్రి వరకు మద్యం షాపులు తెరిచే ఉంచేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.