సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (17:10 IST)

కేసీఆర్ ఇంట మరో అరెస్ట్.. కల్వకుంట్ల తేజేశ్వర రావు అరెస్ట్

Kalvakuntla Tejeshwar Rao
Kalvakuntla Tejeshwar Rao
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కాగా, ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర రావు అలియాస్ కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు.
 
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంట మరో అరెస్ట్ చోటుచేసుకుంది. ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ దాఖలు చేసిన హత్యాయత్నం, భూకబ్జా కేసులో 38 మంది నిందితుల్లో కన్నారావు ఒకరు. 
 
ఆదిబట్లలో ఓఎస్‌ఆర్‌ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చేయాలనుకున్న 2 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడానికి కన్నారావు ప్రయత్నించారని ఆరోపణలు వున్నాయి. హత్యాయత్నం, నేరపూరిత చొరబాటు, నష్టం కలిగించడం, పేలుడు పదార్థాలను ఉపయోగించడం వంటి అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు.
 
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కన్నారావును అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారని తెలుస్తోంది. గత రెండు వారాల్లో కన్నారావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లను తెలంగాణ హైకోర్టు రెండుసార్లు తిరస్కరించడం జరిగింది.