గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2024 (15:04 IST)

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు

revanth reddy
తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుజాతి నుండి శుభాకాంక్షలు అందుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, నిన్నటి వరకు కూడా కేసీఆర్‌పై విరుచుకుపడిన కేసీఆర్ బద్ధ ప్రత్యర్థి, తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పి ఆశ్చర్యపరిచారు.
 
ఇవాళ అసెంబ్లీలో రేవంత్ ప్రసంగిస్తూ కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణను పదేళ్లు ఏలిన మాజీ సీఎం, సీనియర్ రాజకీయ నాయకుడు కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

తెలంగాణ ప్రతిపక్ష నేతగా పనిచేసి తెలంగాణ అభ్యున్నతి కోసం పోరాడేందుకు దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆశిస్తున్నాను. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్‌కు ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.