బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2024 (21:28 IST)

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

KLH Bachupally Campus
కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్‌లోని నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) యూనిట్ బౌరంపేట, బాచుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్ పి హెచ్ ఎస్)లో వరుసగా పలు ప్రభావవంతమైన కార్యక్రమాలను నిర్వహించింది. సమాజ సంక్షేమం మరియు ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను ఇటీవల సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని చేసిన రాష్ట్రీయ ఏక్తా దివస్‌ లో భాగంగా నిర్వహించారు.
 
200 మందికి పైగా పాఠశాల విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఐక్యతా ప్రతిజ్ఞతో ప్రారంభమైంది, యువకులలో జాతీయ సమగ్రత, సంఘీభావాన్ని ఇది కలిగించింది. ఈ  ప్రతిజ్ఞను అనుసరించి, చైల్డ్ పర్సనల్ హైజీన్ ప్రోగ్రామ్ విద్యార్థులకు అవసరమైన పరిశుభ్రత పద్ధతులపై అవగాహన కల్పించింది. కెఎల్‌హెచ్‌ వాలంటీర్ల నేతృత్వంలోని ప్రభావశీల కార్యక్రమం, కెఎల్‌హెచ్‌, పాఠశాల విద్యార్థుల నుండి ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో వ్యక్తిగత ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.
 
స్వచ్ఛత ప్రచారం కూడా ఇక్కడ నిర్వహించబడింది, పాఠశాల ఆవరణలో, చుట్టుపక్కల ప్రాంతాలలో స్వచ్ఛతా కార్యక్రమాలలో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ అవగాహనను ప్రోత్సహించింది. సమాజ బాధ్యత యొక్క భావాన్ని పెంపొందించింది. కార్యక్రమ ముగింపులో, అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ప్రాథమిక చికిత్స శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించబడింది. సర్టిఫికేట్ పొందిన శిక్షకులు ప్రయోగాత్మక ప్రదర్శనలను అందించారు, క్లిష్ట పరిస్థితుల్లో నమ్మకంగా వ్యవహరించడానికి ఇది ప్రతి ఒక్కరికీ తగిన శిక్షణ అందించింది.
 
కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ డా. జి. పార్ధ సారధి వర్మ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ప్రయత్నాలకు తన అభినందనలు తెలియజేశారు, "మా విద్యార్థులను సమాజ సేవలో నిమగ్నం చేయడం సర్దార్ పటేల్ వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా సామాజిక భావనను కూడా కలిగిస్తుంది. ఈ తరహా కార్యక్రమాలు మా సంపూర్ణ విద్య లక్ష్యంలో అంతర్భాగమైనవి" అని అన్నారు. తన అనుభవాన్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ప్రణవ్ వివరిస్తూ, "ఈ కార్యక్రమాలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మన సమాజంలో మనం చేయగల సానుకూల ప్రభావాన్ని చూడటం సంతృప్తికరంగా ఉంది" అని అన్నారు. 
 
ఈ తరహా సంఘటనలు విద్యార్థులు, పాల్గొనేవారిలో ఐక్యతా స్ఫూర్తిని కలిగిస్తాయి. కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్ బృందం ఉత్సాహంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. బలమైన, మరింత సంఘటిత సమాజాన్ని నిర్మించడానికి ఆరోగ్యం, పరిశుభ్రత మరియు సామాజిక బాధ్యతలో ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉంది. కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్. కోటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ కన్వీనర్ జి. లావణ్య పర్యవేక్షణలో, విద్యార్థులలో సామాజిక బాధ్యతను పెంపొందించాలనే సంస్థ యొక్క మిషన్‌‌కు అనుగుణంగా వాటిని విజయవంతంగా నిర్వహించటం జరిగింది.