ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మే 2024 (10:03 IST)

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

school children
రానున్న విద్యాసంవత్సరానికి పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం ఉండదు. తెలంగాణ పాఠశాల విద్యా శాఖలో భాగమైన ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయం ఇప్పటికే 35 శాతం ఉచిత కాంపోనెంట్ పాఠ్య పుస్తకాలను జిల్లా పాయింట్లకు పంపింది. అదనంగా, ఈ విద్యా సంవత్సరం నుండి, పాఠ్య పుస్తకాల, కాగితం మందం చదరపు మీటరుకు 90 గ్రాముల (జీఎస్ఎం) నుండి 70 జీఎస్ఎంకు తగ్గించబడింది.
 
తెలంగాణ పాఠ్యపుస్తకాల ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. గత రెండు విద్యాసంవత్సరాలుగా పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
అయితే, ఈ సంవత్సరం మేము పాఠ్యపుస్తకాలను ముందుగానే ముద్రించాము. మొత్తం ఉచిత కాంపోనెంట్ పాఠ్యపుస్తకాలలో ఇప్పటికే 35 శాతం జిల్లాలకు పంపాము. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు మొదటి దశ పాఠ్యపుస్తకాలను అందజేస్తామని, రెండవ దశ జూన్ లేదా జూలై చివరి వారంలో పంపిణీ చేయబడుతుంది.. అంటూ తెలిపారు.