శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణ ఎన్నికల ప్రచారం : నేడు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన

narendra modi
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు పర్యటించనున్నారు. ఒక రోజు పాటు ఆయన సుడిగాలి పర్యటన చేయనున్నారు. పాలమూరు ఎన్నికల సభలో ఆయన పాల్గొంటున్నారు. సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించనున్నారు. 
 
మహారాష్ట్రలోని సందర్భాల్లో ఉదయం 11.30 గంటలకు ఓ బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు పాలమూరులో ఎన్నికల సభకు హజరవుతారు. అక్కడ నుంచి తిరిగి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం ఆయన ఒడిశాకు వెళ్తారు. భువనేశ్వర్‌లో రాత్రి 8.30 గంటలకు రోడ్‌షో నిర్వహించనున్నారు. 
 
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని హోటల్‌ తాజ్‌కృష్ణలో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం భువనగిరిలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడనుంచి బయల్దేరి ఏపీలోని విజయవాడలో 6.45 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరువుతారు.