ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను నిర్భంధించిన పోలీసులు.. (video)
BRS Leaders
మాజీ మంత్రులు హరీశ్‌రావును నానక్‌రామ్‌గూడలో, పీ సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్ కాలనీలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్‌పల్లిలో గృహనిర్బంధంలో ఉంచారు.
మరోవైపు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి ప్రారంభమయ్యే ర్యాలీకి బీఆర్‌ఎస్ నేతలు హాజరు కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అలాగే పార్టీ అధిష్టానం చలో హైదరాబాద్ పిలుపు మేరకు హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్‌ఎస్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
చిన్నకోడూరు, సిద్దిపేట, నాగగూర్ తదితర మండలాల్లో పలువురు బీఆర్‌ఎస్ నాయకులను సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జహీరాబాద్‌లో పార్టీ నేతలు నామా రవికిరణ్, బండి మోహన్, పలువురు నేతలను శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాదులో నన్ను హౌస్ అరెస్టు చేశారు. నా ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 13, 2024
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నరు.
ఇదేనా ప్రజా పాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.
సిగ్గు సిగ్గు..
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నావు… pic.twitter.com/XfXy8dIFHh
