బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్.. 2 గంటల సేపు వాహనాల్లో తిప్పుతున్నారు.. (video)
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ.. ఎమ్మెల్యే గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ సీనియర్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
బీఆర్‌ఎస్ నేతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా జులుం ప్రదర్శిస్తున్నారని.. రెండుగంటలుగా బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు రోడ్లపైనే తిప్పుతున్నారని మండిపడ్డారు. తలకొండపల్లి వద్ద ఎమ్మెల్యేలను తరలిస్తున్న వాహనాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కేశంపేట మండలం కొత్తపేట వద్ద వాహనానికి అడ్డుగా బీఆర్‌ఎస్ శ్రేణులు భైఠాయించాయి.
దీంతో పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు మారుమ్రోగాయి. వందల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దాంతో వారిని చెల్లాచెదురు చేసేందుకు పోలీసు లాఠీ చార్జి చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.