శ్రీశైలంలో భారీ హుండీ కలెక్షన్లు.. రూ.4,04 కోట్లు ఆదాయం
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులు గురువారం హుండీ సేకరణను లెక్కించారు. మే 9 నుంచి జూన్ 6వ తేదీ వరకు 26 రోజుల కాలవ్యవధికి గాను రూ.4,04,21,906లు భక్తులు సమర్పించారని, హుండీల్లో 332.5 గ్రాముల బంగారం, 5.76 కిలోల వెండి వస్తువులు లభించాయని అధికారులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
భారత కరెన్సీతో పాటు 1768 యూఎస్ఏ డాలర్లు, 45 యూఏఈ దిర్హామ్‌లు, 1 ఖతార్ రియాల్స్, 5 కెనడా డాలర్లు, 10 యూరోలు, 50 యూకే పౌండ్లు, 55 యూఎస్ఏ డాలర్లు, 1 మలేషియా రింగిట్స్, 109 సింగపూర్ డాలర్లు లభించాయి.
కట్టుదిట్టమైన నిఘా, క్లోజ్డ్‌సర్క్యూట్ కెమెరాలతో కౌంటింగ్ నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటీ ఈఓ రవణమ్మ, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.