శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మే 2024 (16:12 IST)

తల్లి పేరుతో లాకర్.. అందులో 19కిలోల బంగారం.. విలువ రూ.14కోట్లు

gold
మే 3న హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్ బల్లాబ్‌గఢ్ బ్రాంచ్‌లో సైబర్ మోసగాడి తల్లి పేరుతో నిర్వహిస్తున్న లాకర్‌లో రూ.14.04 కోట్ల విలువైన 19.5 కిలోల బంగారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలోని మోతీ నగర్‌లో నివాసం ఉంటున్న పునీత్ కుమార్ అనే నిందితుడిని ఏప్రిల్ 3న ఐజిఐ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-3లోని అరైవల్ హాల్ నుండి అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. 
 
అదే రోజు ఢిల్లీ పీఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరుపరిచి 12 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించి, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని ఈడీ సీనియర్ అధికారి తెలిపారు. 
 
సైబర్ క్రైమ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పునీత్ కుమార్ తన తల్లి పేరుతో ఇండియన్ బ్యాంక్‌లో ఉంచిన లాకర్‌లో బంగారం రూపంలో దాచిపెట్టినట్లు తేలింది. దీనిని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.