బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (15:39 IST)

చదివింది ఇంటర్మీడియట్.. కానీ రెండుసార్లు మంత్రిగా...

gaddam prasad
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా గడ్డం ప్రసాద్ నామినేషన్ బుధవారం దాఖలు చేశారు. ఆయనకు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి కూడా మద్దతు ప్రకటించింది. దీంతో ఆయన సభాపతిగా ఎన్నిక లాంఛనం కానుంది. అయితే, గడ్డం ప్రసాద్ చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. కానీ, ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న తొలి దళిత నేత. అయితే, ఈయన చదివింది ఇంటర్ అయినప్పటికీ రాజకీయంగా పెద్ద ట్రాట్ రికార్డు ఉంది. 
 
రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించిన ప్రసాద్.. 2008 ఉపఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మంత్రివర్గంలో పని చేశారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొంతకాలం ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ముగిసిన ఎన్నికల్లో గెలుపొంది, స్పీకర్‌‍గా ఎన్నికకానున్నారు.