సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 31 ఆగస్టు 2024 (13:59 IST)

సెల్ఫీ కోసం కాలు జారి కాలువలో పడిన మహిళ (Video)

Woman
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షం సమయంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి. ఐతే కొంతమంది వర్షంలో కాస్త ప్రకృతి అందాల మధ్య సెల్ఫీలు కోసం ప్రయత్నించి ప్రమాదంలో పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
 
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ వేములపల్లి కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మీదుగా హైదరాబాదు నుంచి మిర్యాలగూడకు ఓ కుటుంబం వెళుతోంది. ఐతే కాల్వ ఒడ్డున సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఓ మహిళకు ప్రమాదాన్ని తెచ్చింది. మరీ కాలువ ఒడ్డుకు వెళ్లి సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆమె కాలు జారి కాలువలో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను తాళ్ల సహాయంతో కాపాడారు. సుమారు 40 నిమిషాల పాటు కాలువలో స్థానికులు ప్రాణాలొడ్డి ఆమెను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.